NLR: ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని ప్రజలు తెలిపారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచారాన్ని చూశామని గ్రామస్తులు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించి, అది పెద్దపులి అని నిర్ధారించారు. తాజాగా ఇవాళ కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటుతుండగా చుసినట్లు తెలియాజేశారు.