కోనసీమ: రేపు రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. శనివారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అన్నాచెల్లల గట్టు వద్ద జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి రధ శకలాల నిమర్జన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.