కృష్ణా: విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతియొక్క విద్యార్థిపై ఉందని బందరు ట్రాఫిక్ ఎస్సై బాలాజీ అన్నారు. మచిలీపట్నంలోని నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలపై ఈరోజు అవగాహన కల్పించారు. రహదారి నియమ నిభందనలు పాటించకపోవడం వాహన చోదకులతో పాటూ ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాద మని తెలిపారు.