VSP: సినీ రంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా అవసరమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వైజాగ్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కన్యాకుమారి చిత్ర ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర కళాకారులకు అపార ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వీవీ రమణమూర్తి తెలిపారు.