TG: పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌లో ఇంటర్ బోర్డు పంపనుంది. హాల్ టికెట్లో తప్పొప్పులను ముందే గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. హాల్ టికెట్లో విద్యార్థుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. హాల్ టికెట్లో తప్పులుంటే కళాశాల ప్రిన్సిపల్‌కు తెలపాలన్నారు.