SRD: సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్(బాలుర) వార్డెన్ కిషన్ నాయక్‌ను సంబంధిత జిల్లా అధికారి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, వార్డెన్ తమను నిత్యం వేధిస్తున్నాడంటూ, మద్యం సేవించి బూతులు తిడుతున్నాడంటూ విద్యార్థులు గురువారం హాస్టల్ ముంది ధర్నా నిర్వహించారు.