ELR: జిల్లాలో మాతా, శిశు మరణాలు జరగకూడదనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించినా కూడా ప్రతినెల మరణాలు నమోదు కావడంపై కలెక్టర్ వెట్రి సెల్వి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మాతా, శిశు మరణాలుపై సమీక్షించారు. మూడు నెలలు కాలంలో మాతృమరణాలు 1, శిశు మరణాలు 47 కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు.