KMM: సమాజంలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా వైరా రవాణాశాఖ కార్యాలయంలో శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా కారులో సీటు బెల్టు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించారన్నారు.