MDK: మాసాయిపేట గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేస్తున్నట్లు సర్పంచ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మాసాయిపేట మండల కేంద్రంలో 10, 11వ వార్డులలో తాగునీటి కోసం రెండు బోర్లను వేశారు. బోర్లు సక్సెస్ కావడం పట్ల కృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ నీటి సమస్య తీరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.