WGL: సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, మేయర్ గుండు సుధారాణి, MLAలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్లు ఇవాళ కలిశారు. గ్రేటర్ WGLలో ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లను జనాభా, విస్తీర్ణం పెరుగుదల దృష్ట్యా పెంచాల్సిన అవసరం ఉందని వారు సీఎంకి వినతి పత్రం అందజేశారు. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం ఈ విషయమై చర్చిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.