TG: తెలుగు రాష్ట్రాల నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్ శక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ నుంచి నలుగురు చొప్పున అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.