ATP: పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ నుంచి 200 క్యూసెక్కుల నీటిని శుక్రవారం దిగువన ఉన్న పెన్నా నదికి విడుదల చేసినట్లు ఏఈ హరి పేర్కొన్నారు. దాదాపు మూడు రోజుల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుందని.. పెన్నానది పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు నది వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.