కృష్ణా: గుడివాడలో శుక్రవారం TDP నేత వేశపోగు ఇమ్మానుయేల్పై YCP వర్గీయులు కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపైనా దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గుడివాడ ఆస్పత్రికి తరలించారు. ఇమ్మానుయేల్తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.