PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరిక మేరకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ప్రకారం కొత్తపాలెం-కోటప్పకొండ రోడ్డుపై యుద్ధప్రతిపాదికన శుక్రవారం పనులు జరుగుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనం అనంతరం ఆ రోడ్డును ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే తెలిపారు.