అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో పల్లె పండుగ 2.0లో భాగంగా ఏర్పాటు చేసిన గోకులం షెడ్డును ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. ఈ షెడ్ రైతులు, పశుపోషకులు, పాడి పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో NDA నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.