VZM: బొండపల్లి మండలంలోని గరుడబిల్లిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను షైనింగ్ స్టార్‌గా మార్చడానికి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.