BPT: చీరాల పట్టణంలోని ఉజిలీ పేట నందు శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రాజముద్ర పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రీసర్వే లో 21.86 లక్షల పాసు పుస్తకాలను వెబ్ ల్యాండ్‌తో సహా ముద్రించడం జరిగిందన్నారు.