వరంగల్: (D)పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి బాబా దర్గా ఉర్సు ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తొర్రూరు, NSPT, MHBD, HNK, WGL, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గోదావరిఖని, మంచిర్యాల, నల్గొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆయా డిపోల అధికారులకు ఆలయ నిర్వహకులు కరపత్రాలను అందించినట్లు తెలిపారు.