NLR: మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి వారి దేవాలయంలో శుక్రవారం మహా రుద్ర యాగం నిర్వహించనున్నారు. ఎస్సై శివ రాకేష్, భద్రతా చర్యలను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులకు సూచించారు. అర్చకులు శ్రీనివాసులతో ఏర్పాట్లపై సమీక్షించారు.