MNCL: తాండూర్ మండలం రేచిని గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. శుక్రవారం ముగ్గురు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గతంలో సైతం పలువురు గాయపడడంతో దీంతో గ్రామంలో వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని కోరుతూ తాండూర్ ఇంచార్జ్ ఎంపీడీవోకి గ్రామస్థులు ఫిర్యాదు చేయడం జరిగింది. సమస్యపై విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.