TG: శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. కేవలం జీతం కోసమే వచ్చారని అధికార పక్ష నేతలు సెటైర్లు వేశారు. అయితే తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ శ్రేణులు పెట్టుకున్న ఆశలను.. కేసీఆర్ వమ్ముచేశారని కామెంట్లు పెడుతున్నారు.