JGL: ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని ఎమ్మెల్సీ ఎలగందుల రమణ పేర్కొన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి కెసీఆర్ ప్రభుత్వం రూ.100 కోట్లతో జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేసిందని విమర్శించారు.