NTR: వీరులపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో రైతులకు తాహసీల్దార్ పాస్ పుస్తకాలను శుక్రవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో 21 గ్రామాలు ఉండగా 12 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రీసర్వే పూర్తిచేసిన గ్రామాల్లో పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు.