GDWL: గద్వాలలో కొనసాగుతున్న శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి శుక్రవారం కృష్ణ తేజ స్వరూపానంద స్వామికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. అనంతరం యాగ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.