TG: రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదవ్వని వారికి ప్రభుత్వం తరపున మెస్సేజ్ వస్తుందన్నారు. అలా వచ్చిన వారు దగ్గర్లోని మీ-సేవ కేంద్రానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ లింకైన మొబైల్‌ను వెంట తీసుకెళ్లి, ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.