NRPT: ముగ్ధంపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సర్పంచ్ తిరుమలేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యా ప్రమాణాలు పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.