BPT: రేపల్లె రైలుపేటలోని పట్టాభి రామస్వామి ఆలయంలో శుక్రవారం గోదా దేవికి పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామిని నిత్యం పూజించి స్వామివారి అనుగ్రహం కోసం నెల రోజుల పాటు గోదా అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు అన్నారు. గోదా అమ్మవారిని పల్లకిలో ఉంచి వీధుల్లో ఊరేగించారు.