AP: కర్నూలు జిల్లాలో శ్రేయ గ్రూప్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 8,128 డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసిన శ్రేయ గ్రూప్, అధిక వడ్డీలు ఇస్తామంటూ స్కీమ్‌లతో ప్రజలను మోసం చేసింది. సంస్థ నిర్వాహకులు హేమంత్‌కుమార్, భార్య సంగీతారాయ్ పేరుతో ఆస్తులు సృష్టించినట్లు తేలింది. దీంతో జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో.. 51.55 ఎకరాల భూమి జప్తునకు CIDకి అనుమతి ఇచ్చింది.