GNTR: ఫిరంగిపురం మండలం గొల్లపాలెంలో గుంటూరు ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు ‘నువ్వు పంటలో సమగ్ర యాజమాన్యం’పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. ఏ. మనోజ్ మాట్లాడుతూ.. రైతులు ఒకే రకం పంటలు కాకుండా, ప్రత్యామ్నయంగా నువ్వు సాగు చేపడితే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు.