NZB: త్రీ టౌన్ పరిధిలో రైతుబజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్లో నిన్నరాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు చేస్తున్నామని SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.