MNCL: తాండూర్ మండలం కిష్టంపేట్లో బెల్ట్ షాపులు, స్క్రాప్ దుకాణాలు ఎత్తివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ తిరుపతి గ్రామస్థులతో కలిసి మెమోరాండం అందజేశారు. యువత మద్యం మత్తులో దొంగతనాలకి పాల్పడి దొంగలించిన వస్తువులను స్క్రాప్ దుకాణాలకు అమ్మి వచ్చిన డబ్బులను మళ్లీ బెల్ట్ షాపులలో మందు తాగుతున్నారన్నారు.