పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన పీఎం విశ్వకర్మ ప్రయోజనాల కార్యక్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి, ఉపాధ్యక్షురాలు నిర్మల ఆయనను ఘనంగా సన్మానించారు. కులవృత్తిదారులకు పథకం ద్వారా లభించే లబ్ధిపై ఈ సభలో చర్చించారు.