ADB: గంజాయి సేవించిన, రవాణా చేసిన, పండించిన వ్యాపారం చేసిన వారిపై చర్యలు తప్పవని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా రూపొందించడానికి పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. పట్టణంలో నార్కోటిక్ జాగిలం రొమాతో తనిఖీలు నిర్వహించగా ధన్గర్ మెహెల్లాకు చెందిన షాహిల్ అహ్మద్ గంజాయితో పట్టుకోవడం జరిగిందని సీఐ వెల్లడించారు.