TG: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ఉంటే.. అది కూడా తొలగించారన్నారు. కేంద్రంలోని బీజేపీతో మాట్లాడి.. అర్బన్ ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.