కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన వాహనాల నిలుపుదల షెడ్డును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వాహనాలు ఎండ, వానల నుంచి రక్షణ పొందేందుకు, క్రమబద్ధంగా ఉంచేందుకు ఈ షెడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నర్సింహారెడ్డి, మోటర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఉన్నారు.