KDP: బద్వేల్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలోని కాంట్రాక్టర్లు, ప్రజలు 2014-19 మధ్యకాలంలో ఉపాధి హామీ పథకం కింద వేసిన సీసీ రోడ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన వివరాలను అందించాలని బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ రితీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల ఐదులోపు బద్వేల్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో అందిస్తే తదుపరి బిల్లుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.