మెదక్ జిల్లాలో నూతన సంవత్సర సందర్భంగా జిల్లా అధికారులు, ఇతర వర్గాల నుంచి మంచి స్పందనతో బ్లాంకెట్స్ అందజేశారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో 2500 మంది విద్యార్థులకు బ్లాంకెట్స్ అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు వెయ్యికిపైగా బ్లాంకెట్స్ వచ్చాయని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కలవడానికి వచ్చేవారు బ్లాంకెట్స్ సహకారం అందించాలని సూచించారు.