SRPT: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజనాయక్ తండాలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను రూరల్ ఎస్సై బాలు నాయక్ ఘనంగా ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణను, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లూనావత్ శాంతాబాయి పండు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మైదానంలో ఆటగాళ్లు ఉత్సాహంగా తలపడ్డారు.