VSP: రైతులకు త్వరితగతిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం పెద్ద నాగమయ్యపాలెంలో పాస్ బుక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రీ సర్వే పూర్తి చేసి అందరికీ పాస్ పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు.