MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలను పొందాలంటే ఫార్మర్ ఐడి తప్పనిసరి అని రాచాల ఏఈవో శివ తెలిపారు. ఫార్మర్ ఐడి కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు వేదికలో సంప్రదించాలి. ఈ అవకాశాన్ని రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.