HYD: బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12 నుంచి ఫిలింనగర్ జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ–హబ్, శిల్పాలే అవుట్ మీదుగా కొత్త ఎక్స్ప్రెస్వే ప్రతిపాదించినట్లు HMDA కమిషనర్ అహ్మద్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పాలే అవుట్ సమీపంలోని వంతెన వరకు ఈ ప్రణాళికను రూపొందించారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.