WGL: నల్లబెల్లి(M )కేంద్రంలోని ఓ ప్రవేట్ ఫర్టిలైజర్ షాప్లో రైతులకు షరతులు విధిస్తూ యూరియా విక్రయిస్తున్నట్లు బజ్జీ తండా సర్పంచ్ రవి ఇవాళ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం షరతులు లేకుండా యూరియా అందించాలని పేర్కొన్నారు. దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా ఇవ్వాలని అధికారులను కోరారు.