సత్యసాయి: సోమందేపల్లి మండలం నాగినాయనచెరువు గ్రామంలో శుక్రవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. గతంలో పాస్ బుక్‌లపై జగన్ ఫొటో ఉండడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాజముద్రతో రైతులకు ఇబ్బందులన్నీ తొలగిపోయాయన్నారు.