TG: హైదరాబాద్ పరిపాలన కోసం ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… గత ప్రభుత్వం సిబ్బందిని నియమించకుండానే జిల్లాలను 33కు పెంచిందన్నారు. 33 కలెక్టరేట్లను నిర్మించింది కానీ.. వాటిలో సిబ్బంది లేరని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీ ద్వారా కలెక్టరేట్లలో సిబ్బందిని నియమించామన్నారు.