GDWL: మానవపాడు మండలంలోని MPPS ప్రాథమిక పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధనా విధానాలు, విద్యార్థుల ప్రతిభ, హాజరు రిజిస్టర్లు, డైరీలను పరిశీలించారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్ విషయాల్లో విద్యార్థులను ప్రశ్నించి వారి సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు.