PLD: మాచర్ల నియోజకవర్గ పరిధిలో 2024-25 సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. శుక్రవారం నెహ్రునగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 580కి పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా రూ.8 లక్షల నగదు అందజేశారు.