TG: డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా.. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా దేవా పని చేస్తున్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్ గఢ్లో ఒకే గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.