SKLM: గిరిజన సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శుక్రవారం మందస ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఏపీవో జి.చిన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ గ్రీవెన్స్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల నుండి పలు వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.