అనంతపురంలోని నడిమి వంక వద్ద ఏర్పాటు చేస్తున్న వడ్డె ఓబన్న కాంస్య విగ్రహానికి వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ రూ. 2లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు నగదు మొత్తాన్ని శుక్రవారం వడ్డె ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు అందజేశారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని హరి ప్రసాద్ పేర్కొన్నారు.