SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో పాటు మహాశివరాత్రి జాతరను సందర్బంగా శుక్రవారం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జాతర సమన్వయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వారు ఈ శిబిరం ఏర్పాటు చేశారు.